Avatar-2: చడీచప్పుడు లేకుండా డిస్నీ హాట్ స్టార్ లోకి వచ్చేసిన అవతార్-2

  • గతేడాది డిసెంబరు 15న థియేటర్లలోకి వచ్చిన అవతార్ సీక్వెల్
  • 173 రోజుల తర్వాత ఓటీటీ వేదికపై విడుదల
  • జూన్ 7 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
Avatar 2 now streaming on Disney Hotstar Plus

హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి అవతార్ కు కొనసాగింపుగా వచ్చిన చిత్రం అవతార్: ద వే ఆఫ్ వాటర్. గత ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2.3 బిలియన్ డాలర్ల మేర భారీ వసూళ్లు రాబట్టింది. 

ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులు సంతోషపడేలా ఓటీటీ తెరపై నిన్న రిలీజ్ అయింది. జూన్ 7 నుంచి డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 2022 డిసెంబరు 15న అవతార్-2 ప్రేక్షకుల ముందుకు రాగా, 173 రోజుల సుదీర్ఘ సమయం తర్వాత ఓటీటీ వేదికపై రంగప్రవేశం చేసింది. 

ఇటీవల అవతార్-2 యూట్యూబ్ లో రిలీజ్ అయినా, అది చెల్లింపు (Rent/Buy) ప్రాతిపదికన కావడంతో చాలామంది నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు డిస్నీ ప్లస్ లోకి రావడంతో వీక్షణల సంఖ్య భారీగా నమోదవుతోంది.

More Telugu News