Advertisement

500 మంది డాన్సర్లతో అదిరే స్టెప్పులు వేస్తున్న విజయ్!

Leo movie update
  • ముగింపు దశలో 'లియో' చిత్రీకరణ 
  • చెన్నైలో జరుగుతున్న చివరి షెడ్యూల్ 
  • కోట్ల రూపాయల ఖర్చుతో వేసిన ప్రత్యేకమైన సెట్
  • అక్టోబర్ 19వ తేదీన సినిమా విడుదల   
విజయ్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో 'లియో' సినిమా రూపొందుతోంది. 'మాస్టర్' తరువాత వాళ్లిద్దరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లిన సినిమా ఇది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో కథానాయికగా 'త్రిష' అలరించనుంది. మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా వేగంగా షూటింగ్ జరుపుతూ వచ్చారు. 

తాజా షెడ్యూల్ ను చెన్నైలో మంగళవారం రోజున మొదలుపెట్టారు. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఒక పాటను చిత్రీకరించనున్నారు. ఇది విజయ్ ఇంట్రడక్షన్ సాంగ్. ఈ పాటలో 500 మంది డాన్సర్లు కనిపించనున్నారని అంటున్నారు. ఎక్కువ మంది డాన్సర్లు పాల్గొనడం వలన, రెండు వారాల పాటు ఈ పాటనే చిత్రీకరించనున్నారని చెబుతున్నారు.

దినేశ్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. సెట్ కోసమే భారీ మొత్తాన్ని ఖర్చు చేసినట్టుగా సమాచారం. అనిరుధ్ అందించిన బాణీ మాస్ ఆడియన్స్ లోకి ఒక రేంజ్ లో దూసుకెళుతుందని చెబుతున్నారు. సంజయ్ దత్ .. అర్జున్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అక్టోబర్ 19వ తేదీన విడుదల కానుంది.
Advertisement
Vijay
Trisha
Lokesh Kanagaraj
Leo Movie

More Telugu News