Varun Tej: 'గాండీవధారి అర్జున' రిలీజ్ డేట్ ఖరారు!

  • ప్రవీణ్ సత్తారు నుంచి 'గాండీవధారి అర్జున'
  • యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ 
  • సాక్షి వైద్య చేస్తున్న రెండో సినిమా ఇది 
  • ఆగస్టు 25వ తేదీన విడుదలవుతున్న సినిమా
Gandeevadhari Arjuna Movie Update

వరుణ్ తేజ్ - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో 'గాండీవధారి అర్జున' సినిమా రూపొందుతోంది. వరుణ్ తేజ్ తన కెరియర్లో చేసిన పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ ముహూర్తాన్ని ఖాయం చేశారు.

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటిక్రితం విడుదల చేశారు. 'ఏజెంట్' సినిమాలో అఖిల్ జోడీగా మెరిసిన సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్.  

మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో ప్రవీణ్ సత్తారు కంటూ ఒక మార్క్ ఉంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిట్ కొడతాడేమో చూడాలి. ప్రవీణ్ సత్తారు కూడా ఈ హిట్ చాలా అవసరం. 

More Telugu News