రైలు ప్రయాణికులకు కేవలం 35 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్!
- రైలు టికెట్ కు అనుబంధంగా బీమా సదుపాయం
- ఐఆర్ సీటీసీ ద్వారా బుకింగ్ సమయంలో ఎంపికకు అవకాశం
- ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం పాలైనా పరిహారం
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం తర్వాత మరోసారి ఈ చౌక ఇన్సూరెన్స్ ఎంత విలువైనదో తెలియవచ్చింది. ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో ఈ బీమా సుదుపాయాన్ని కూడా ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బీమాను ఎంపిక చేసుకున్న వారికి.. ప్రమాదంలో మరణించినట్టయితే రూ.10లక్షల పరిహారం లభిస్తుంది. శాశ్వత అంగవైలక్యం పాలైనా రూ.10 లక్షలు అందుకోవచ్చు. శాశ్వత పాక్షిక అంగవైకల్యం పాలైన వారికి రు.7.5 లక్షలు చెల్లిస్తారు. గాయాలతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తే రూ.2 లక్షలు ఇస్తారు. శవ తరలింపునకు అయ్యే రవాణా వ్యయాల కోసం రూ.10వేలు చెల్లిస్తారు.