గద్వాల జిల్లాలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి
- కృష్ణా నదిని చూసేందుకు ఆటోలో వెళ్లిన 11 మంది
- ఈత రాక మునిగిపోయిన నలుగురు చిన్నారులు
- మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు
- మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు
ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఘటన స్థలి వద్ద ఆర్తరోదనలు మిన్నంటుతున్నాయి.
ఆలంపూర్ నియోజవకర్గంలో కృష్ణా నదిని చూసేందుకు 11 మంది ఆటోలో వెళ్లారు. నదిలో దిగిన చిన్నారులకు ఈత రాకపోవడంతో నీట మునిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నది వద్దకు చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు.