సోదరి చితి మంటల్లో దూకిన యువకుడు... పరిస్థితి విషమం!
- రాజస్థాన్‌లోని భివారా జిల్లాలో గురువారం ఘటన
- ఆసుపత్రిలో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న యువకుడు
- 95 శాతం గాయాలతో వాంగ్మూలం ఇచ్చే పరిస్థితుల్లో లేడన్న పోలీసులు
భివారా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంచల్ మిశ్రా ఈ ఘటనపై మాట్లాడారు. సుఖ్ దేవ్ భిల్ ఆసుపత్రిలో చేరడంతో ఆసుపత్రి వర్గాలు తమకు సమాచారం అందించాయని చెప్పారు. 95 శాతం కాలిన గాయాలతో అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. అతను తన వాంగ్మూలాన్ని ఇచ్చే పరిస్థితుల్లో లేడన్నారు.