రోడ్డు నిర్మాణంలో ఇదో లీల.. కొత్తగా వేసిన రోడ్డును ఉత్తచేతులతో లేపిన గ్రామస్థులు.. వీడియో ఇదిగో!

రోడ్డు నిర్మాణంలో ఇదో లీల.. కొత్తగా వేసిన రోడ్డును ఉత్తచేతులతో లేపిన గ్రామస్థులు.. వీడియో ఇదిగో!

Video Shows Maharashtra Villagers Lifting Newly Made Road With Bare Hands
  • మహారాష్ట్రలోని జల్లా జిల్లాలో ఘటన
  • రోడ్డును కార్పెట్‌లా లేపేసిన గ్రామస్థులు
  • జర్మన్ టెక్నాలజీతో నిర్మించామన్న కాంట్రాక్టర్
38 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాను ఇప్పుడు ఊపేస్తుంది. ఓ కాంట్రాక్టర్ నిర్మించిన తారు రోడ్డును గ్రామస్థులు ఉత్త చేతులతో కార్పెట్‌లా అమాంతంగా లేపేసి.. రోడ్డు నాణ్యత ఏపాటిదో కళ్లకు కట్టినట్టు అందరికీ చూపించారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖరీలో ఈ రోడ్డును నిర్మించారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎం రూరల్ రోడ్ స్కీమ్)లో భాగంగా ఈ రోడ్డును నిర్మించారు. రోడ్డును వేసింది స్థానిక కాంట్రాక్టర్ రాణా ఠాకూర్. 

వీడియో వైరల్ అయిన తర్వాత కాంట్రాక్టర్ స్పందించాడు. రోడ్డు నిర్మాణానికి జర్మన్ సాంకేతికతను ఉపయోగించినట్టు పేర్కొన్నాడు. రోడ్డును చేత్తో అమాంతం లేపేసిన గ్రామస్థులు ఈ నాసిరకం రోడ్డుకు అప్రూవల్ ఇచ్చిన ఇంజినీర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisement
Maharashtra
Karjat-Hast Pokhari
New Road
Viral Videos

More Telugu News