ఏపీలోని మూడు రిజర్వాయర్ల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ!
- ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలపై స్టే ఇచ్చిన ఎన్జీటీ
- రూ.100 కోట్ల జరిమానా తమకు భారమన్న ఏపీ
- ప్రస్తుతానికి రూ.25 కోట్లు జమ చేయాలన్న సుప్రీం
ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఎన్జీటీ స్టేని ఎత్తివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే, ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా విధించవచ్చా? అన్న అంశంపై మాత్రం పాక్షికంగా స్టే విధించింది. ఎన్జీటీ రూ.100 కోట్లు జరిమానా విధించడం చట్టబద్ధం కాదని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని అంత జరిమానా భారం అవుతుందన్నారు. రూ.100 కోట్ల జరిమానా నిలుపుదల చేయాలని కోర్టును కోరారు. దీంతో ప్రస్తుతానికి రూ.25 కోట్లు కృష్ణా బోర్డులో జమ చేయాలని సుప్రీం ధర్మాసనం ఏపీ సర్కారును ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్కు వాయిదా వేసింది.