కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య? ఖర్గే ప్రకటించే ఛాన్స్!
- మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యనే కోరుకుంటున్నారని నివేదిక
- ఈ రోజు రాత్రి అధ్యక్షుడికి పరిశీలకుల నివేదిక
- ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించినట్లు వెల్లడి
మధ్యాహ్నం రెండు గంటల వరకు సమావేశం జరిగిందని, తాము ఒక నివేదికను సిద్ధం చేశామని, దానిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడికి అందిస్తున్నామని పరిశీలకులు అన్నారు. కొత్త సీఎంను ఎన్నుకోవడానికి శాసన సభా పక్ష సమావేశం అవుతుంది. ఇందుకు సంబంధించి ముగ్గురు పరిశీలకులను సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలను నియమించింది.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేందుకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ ఈ రోజు మాట్లాడుతూ సిద్ధరామయ్య, డికే శివకుమార్ ఇద్దరూ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులేనని, ఇద్దరూ ముందుండి కర్ణాటకలో పార్టీ కోసం పని చేశారని, నాయకత్వం వహించారని వ్యాఖ్యానించారు. పార్టీని బలోపేతం చేయడానికి ఇద్దరూ తమ శాయశక్తులా కృషి చేశారన్నారు. అయితే కర్ణాటక సీఎం ఎవరు అవుతారో చూద్దామని, సీఎల్పీ అభిప్రాయం ఏమిటో చూద్దామన్నారు.