TG Venkatesh: ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తులు ఉంటాయి: టీజీ వెంకటేశ్

TG Venkatesh opines on alliance in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పొత్తుల అంశంపై చర్చ అధికమవుతోంది. దీనిపై బీజేపీ నేత టీజీ వెంకటేశ్ స్పందించారు. ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తులు ఖరారవుతాయని వెల్లడించారు. పరిస్థితులకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. వైసీపీ సర్కారును అధికార పీఠం నుంచి కిందికి దించడమే బీజేపీ అజెండా అని, ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తమతోనే ఉంటారని భావిస్తున్నామని టీజీ వెంకటేశ్ తెలిపారు. 

ఇక, వైసీపీ, బీజేపీ ఒకటేనన్న ప్రచారంపైనా ఆయన వివరణ ఇచ్చారు. కేంద్రం మద్దతు ఇచ్చింది ఏపీ ప్రభుత్వానికి మాత్రమేనని, వైసీపీకి కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చిందని, దాన్ని అంతవరకే చూడాలని అన్నారు. బీజేపీ... ఏపీలో వైసీపీకి మద్దతు ఇస్తోందన్న తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు.
Go Back to Shorts
TG Venkatesh
Alliance
BJP
Janasena
Pawan Kalyan
YSRCP
Andhra Pradesh

More Telugu News