సీజీఎఫ్ నిధుల వినియోగంపై ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
- కామన్ గుడ్ ఫండ్ సొమ్మును ధూపదీప నైవేద్యాలకే వినియోగించాలని పిల్
- నిధుల్ని కార్యాలయాలకు వినియోగించడంపై హైకోర్టు అసంతృప్తి
- సీజీఎఫ్ నిధుల వినియోగంపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే
సీజీఎఫ్ నిధులను కార్యాలయాల నిర్మాణాలకు వినియోగిస్తున్నారని ఓ విలేకరి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నిబంధనల మేరకే నిధులు ఉపయోగించాలని, ఆ సొమ్మును ధూపదీప నైవేద్యానికే వినియోగించాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం దేవాదాయ శాఖ కార్యాలయాల నిర్మాణాలకు సీజీఎఫ్ నిధుల వినియోగంపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.