Lawrence: ఓటీటీలో 'రుద్రుడు' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే .!

Rudrudu streaming date confirmed
షార్ట్స్‌లో చూడండి
లారెన్స్ నుంచి ఇటీవల కాలంలో సినిమాలేవీ రాలేదు. ఒకప్పుడు వరుసగా హారర్ కామెడీ సినిమాలను వదులుతూ వెళ్లిన ఆయన, భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. అలాంటి ఆయన ఈ మధ్య కాలంలో తన జోరును తగ్గించారు. క్రితం నెలలోనే ఆయన నుంచి 'రుద్రన్' (రుద్రుడు) సినిమా వచ్చింది. 

యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ఏప్రిల్ 14వ తేదీన విడుదలైంది. తమిళంలో ఈ సినిమా బాగానే ఆడింది కానీ, తెలుగులో మాత్రం అంతగా ఆదరణ పొందలేదు. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సన్ నెక్స్ట్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 14 నుంచి తెలుగు .. తమిళ భాషల్లో స్ట్రీమింగ్ మొదలుకానుంది. 

కథిరేసన్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో, లారెన్స్ జోడీగా ప్రియా భవాని శంకర్ కనిపించనుంది. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. శరత్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, నాజర్ .. పూర్ణిమ భాగ్యరాజ్ .. కాళీ వెంకట్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

Go Back to Shorts
Lawrence
Priya Bhavani
Sarath Kumar
Rudrudu Movie

More Telugu News