ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు
- తాజాగా 2 వేల పేజీలతో అనుబంధ చార్జిషీటు
- స్కాంలో సిసోడియా పాత్రను వివరిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీటు
లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాను ఈడీ ఫిబ్రవరి 26న అరెస్ట్ చేయడం తెలిసిందే. ఇటీవల ఆయన జ్యుడిషియల్ కస్టడీని మే 8 వరకు పొడిగించారు. తీహార్ జైలులో ఉంటున్న సిసోడియాను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.