Kiran Abbavaram: ఈ వారం ఓటీటీ సినిమాలివే!

  • నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 3న 'తూ జూఠీ మైన్ మక్కర్' హిందీ మూవీ
  • ఈ నెల 5వ తేదీ నుంచి కిరణ్ అబ్బవరం  'మీటర్'
  • అదే రోజున ఈటీవీ విన్ లో 'మ్యాచ్ ఫిక్సింగ్' తెలుగు సినిమా 
  • మే 5వ తేదీనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'కరోనా పేపర్స్' మలయాళ మూవీ
  • అదే రోజున జీ 5లో 'ఫైర్ ఫ్లైస్: పార్ద్ ఔర్ జుగ్ను' హిందీ సినిమా 
OTT Movies Releasing in this Week

ఓటీటీ సినిమాలకి ఒక రేంజ్ లో ఆదరణ పెరిగిపోతోంది. అలాగే వెబ్ సిరీస్ ల పట్ల కూడా విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారు. దాంతో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ను అందించడానికి ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ఓటీటీ సెంటర్స్ లోకి కొన్ని సినిమాలు .. వెబ్ సిరీస్ లు దిగిపోతున్నాయి. 
  
నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 3వ తేదీన 'తూ జూఠీ మైన్ మక్కర్' అనే హిందీ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక 5వ తేదీన  'మీటర్' సినిమా అందుబాటులోకి రానుంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా, థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయి రెస్పాన్స్ ను రాబట్టలేకపోయింది. ఇక ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి. 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'కరోనా పేపర్స్' అనే మలయాళ సినిమా, జీ 5లో  'ఫైర్ ఫ్లైస్: పార్ద్ ఔర్ జుగ్ను' హిందీ సినిమా ఈ నెల 5వ తేదీన స్ట్రీమింగ్ కానున్నాయి. అలా ఈటీవీ విన్ లో 'మ్యాచ్ ఫిక్సింగ్' తెలుగు సినిమా కూడా ఈ నెల 5 నుంచే అందుబాటులోకి రానుంది. 

More Telugu News