కొత్త సచివాలయంలో కేసీఆర్ తొలి సమీక్ష
- ఇరిగేషన్ శాఖపై సీఎం కేసీఆర్ రివ్యూ
- పాలమూరు ఎత్తిపోతల పథకంపై సమీక్ష
- సమావేశానికి హాజరుకానున్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు
తెలంగాణ నూతన సచివాలయం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం తరువాత సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన కార్యాలయాల్లో ఆసీనులై తొలి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అంబేద్కర్ స్ఫూర్తితో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు బాధ్యతలు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.