నవ్వులు పూయించే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’
- ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా కొత్త సినిమా టీజర్
- చెఫ్ పాత్రలో అనుష్క
- స్టాండప్ కమెడియన్ గా నవీన్ పొలిశెట్టి
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది. ఒక స్టార్ హోటల్ లో చెఫ్‌కు, స్టాండప్ కమెడియన్‌కు మధ్య ప్రేమకథను ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో చూపించబోతున్నట్టు టీజర్ లోనే దర్శకుడు స్పష్టం చేశాడు. చెఫ్ పాత్రలో అనుష్క, స్టాండప్ కమెడియన్ పాత్రలో నవీన్ కనిపించబోతున్నారు. జీవితంలో పెళ్లి వద్దనుకునే అనుష్క, నవీన్‌తో ఎలా ప్రేమలో పడింది? వాళ్ల ప్రేమ.. పెళ్ళి వరకు వెళ్తుందా? అనే యాంగిల్ లో దర్శకుడు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నవీన్ మార్కు కామెడీ టైమింగ్ తెగ ఆకట్టుకునేలా ఉంది. దాంతో, టీజర్ యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో సినిమా తెలుగు, తమిళ్ లో విడుదల కానుంది.