'ఆర్ఆర్ఆర్' సినిమాలో సైడ్ డ్యాన్సర్ అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆర్ఆర్ఆర్' సినిమాలో సైడ్ డ్యాన్సర్ అరెస్ట్

RRR dancer arrested
  • 'ఎత్తర జెండా' పాటలో సైడ్ డ్యాన్సర్ మణికంఠ అరెస్ట్
  • మరో నలుగురు డ్యాన్సర్లతో కలిసి మందు తాగుతూ గొడవ
  • వాచ్ మెన్ ను మూడో అంతస్తు నుంచి తోసివేసిన వైనం
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయాన్ని సాధించింది. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో సైతం ప్రేక్షకాదరణను పొందింది. ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాట ఏకంగా ఆస్కార్ అవార్డునే గెలుచుకుంది. మరోవైపు ఈ సినిమాలో 'ఎత్తర జెండా' పాటలో సైడ్ డ్యాన్సర్ గా చేసిన మణికంఠన్ ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

వివరాల్లోకి వెళ్తే బంజారా హిల్స్ రాఘవ రెసిడెన్సీలో మరో నలుగురు డ్యాన్సర్లతో కలిసి మణికంఠన్ మందు తాగి గొడవ చేస్తుండగా వాచ్ మెన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కారిడార్ లో గొడవ చేయవద్దని సూచించాడు. దీంతో, కోపం తట్టుకోలేకపోయిన మణికంఠన్ వాచ్ మెన్ తో గొడవపడ్డాడు. అతడిని మూడవ అంతస్తు నుంచి తోసేశాడు. ప్రస్తుతం వాచ్ మెన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మణికంఠన్ ను అరెస్ట్ చేశారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన మణికంఠన్ ప్రస్తుతం టాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు.
Advertisement
RRR
Dancer
Arrest

More Telugu News