క్యాన్సర్ తో బాధపడుతున్న సంగీతకారుడి కుటుంబానికి తమన్ రూ.10 లక్షల సాయం
- ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం
- న్యాయనిర్ణేతగా తమన్
- తమన్ సాయం గురించి వెల్లడించిన గాయని గీతామాధురి
ఈ కార్యక్రమంలోనే గీతామాధురి... తమన్ చేసిన సాయాన్ని అందరికీ తెలియజేశారు. తమ మ్యూజిషియన్లలో ఒక కుర్రాడికి క్యాన్సర్ సోకిందని, అతడి ఫ్యామిలీ మెంబర్స్ కీమో థెరపీ చేయించారని గీతామాధురి వెల్లడించారు. అయితే బిల్లు కడితేనే అతడిని డిశ్చార్జి చేస్తామని ఆసుపత్రి వర్గాలు చెప్పాయని, ఈ విషయం తమన్ గారికి తెలియడంతో ఆయన వెంటనే రూ.10 లక్షలు అందించారని ఆమె వివరించారు.
కాగా, సామాజిక దృక్పథం ఉన్న తమన్ 100 మంది వృద్ధులకు ఆశ్రయం ఇవ్వగల ఓ ఆశ్రమాన్ని గుంటూరు వద్ద నిర్మిస్తున్నారు. ఈ వృద్ధాశ్రమం త్వరలోనే ప్రారంభం కానుందని తమన్ వెల్లడించారు.