మేమింకా ఇక్కడ ఎందుకు ఉండాలంటూ ఉద్యోగుల ప్రశ్న.. మెటా సీఈఓ సమాధానం ఇదీ!
- ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో వరుస పెట్టి లేఆఫ్స్
- తాజాగా మరోమారు 4 వేల మంది తొలగింపు
- గురువారం ఉద్యోగులతో మెటా సీఈఓ వర్చువల్ సమావేశం
- సమావేశంలో పెల్లుబికిన ఉద్యోగుల ఆవేదన
- సంస్థలో ఎందుకు కొనసాగాలంటూ సీఈఓకు ఉద్యోగుల సూటి ప్రశ్న
- కోట్ల మందికి చేరువయ్యే అవకాశం మనదేనంటూ సీఈఓ సమాధానం
‘‘మీరు మా నైతికస్థైర్యాన్ని ధ్వంసం చేశారు. అసలు మేము సంస్థలో ఎందుకు ఉండాలి’’ అంటూ ఉద్యోగులు సీఈఓను సూటిగా నిలదీశారు. దీనిపై జుకర్‌బర్గ్ ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చారు. ‘‘మెటా ఓ ప్రత్యేకమైన సంస్థ. వివిధ రకాల ఉత్పత్తులతో అనేక మందికి విభిన్నమైన సామాజిక అనుభూతులను ఇస్తోంది. కోట్ల మందికి చేరువై విస్తృత స్థాయిలో ప్రభావితం చేయాలనుకునే వారికి ఇంతకంటే గొప్ప వేదిక మరొకటి లేదు. మనలాగా సామాజిక స్థాయిలో ప్రజలను ప్రభావితం చేసే సంస్థ మరొకటి లేదు’’ అని జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు.