ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న గంగూలీ, కోహ్లీ
- గంగూలీ టైంలోనే కెప్టెన్సీకి కోహ్లీ దూరం
- నిన్న చేయి కలిపేందుకు నిరాకరించిన కోహ్లీ
- గంగూలీని కోహ్లీ అన్-ఫాలో చేయగా, గంగూలీ కూడా అదే దారిలో..
ఢిల్లీతో మ్యాచ్ అనంతరం గంగూలీని కోహ్లీ అన్-ఫాలో చేయగా... గంగూలీ కూడా అదే దారిలో నడిచాడు. ఇన్ స్టాలో గంగూలీకి 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండగా, 106 మందిని అనుసరిస్తున్నాడు. కోహ్లీకి 246 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, 276 మందిని అనుసరిస్తున్నాడు.
అయితే వీరు ఇరువురు ఒకరినొకరు మాత్రం ఫాలో కావడం లేదు. ఇటీవల మ్యాచ్ అనంతరం గంగూలీతో చేతులు కలిపేందుకు కోహ్లీ నిరాకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.