స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న మహిళా క్రికెటర్
- సారా వెర్న్ తో ఆసీస్ ఆల్రౌండర్ జెస్ జోనాసెన్ వివాహం
- డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీకి ఆడిన జోనాసెన్
- స్వలింగ వివాహ జాబితాలో క్రికెటర్లు మెగాన్ షట్, మరిజానె కాప్, సాటర్త్‌వైట్
ఈనెల 6న హవాయి ద్వీపంలో అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఈ తేదీకి తన హృదయంలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని జోనాసెన్ ట్వీట్ చేసింది. కాగా, ఆసీస్ జట్టులో కీలక ఆల్‌రౌండరైన 30 ఏళ్ల జొనాసెన్ ఐదుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్‌లో సభ్యురాలు. గతేడాది వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన ఆసీస్ జట్టులోనూ కీలకంగా ఉన్న ఆమె ఈ ఏడాది భారత్‌లో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. కాగా, మెగాన్ షట్, మరిజానె కాప్, అమీ సాటర్త్‌వైట్ లాంటి పలువురు మహిళా స్టార్ క్రికెటర్లు ఇదివరకే తమ ప్రియురాళ్లను పెళ్లాడారు. ఇప్పుడు ఈ జాబితాలో జోనాసెన్ కూడా చేరింది.