Kodali Nani: జగన్ వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ, చంద్రబాబులను ఇంటికి పంపడం ఖాయం: కొడాలి నాని
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, వైనాట్ పులివెందుల అంటున్న బాలకృష్ణకు వచ్చే ఎన్నికల్లో జగన్ అంటే ఏమిటో చూపిస్తారని హెచ్చరించారు. జగన్ వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ, చంద్రబాబులను ఇంటికి పంపడం ఖాయమని అన్నారు.
ప్రజల్లో నమ్మకం కోల్పోయి, కార్యకర్తల మద్దతు లేనివారికి జగన్ టికెట్లు ఇవ్వడని, తాము టికెట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్ లో ఉంటే తమకేం అవుతుందని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు టచ్ లో ఉండడం ముఖ్యమని, ప్రజాదరణ లేని ఎమ్మెల్యేలు కాదని వ్యాఖ్యానించారు.