చిన్న పిల్లలపై పంజా విసురుతున్న కొత్త వేరియంట్.. లక్షణాలు ఇవే!
- గతేడాది సెప్టెంబరు తర్వాత తొలిసారి 6 వేల మార్కును దాటిన కేసులు
- పెరుగుతున్న కేసులకు ‘ఎక్స్‌బీబీ 1.16’ వేరియంట్ కారణమని అభిప్రాయం
- అధిక జ్వరం, దగ్గు, జలుబు, కళ్లకు పుసులు, దురద వంటి లక్షణాలు
- ఈ వేరియంట్ మరింత బలపడే అవకాశం ఉందంటున్న నిపుణులు
ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16కు సంబంధించిన కేసులు వందల సంఖ్యలో నమోదైనట్టు ఇండియన్ సార్స్‌కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇవి రెండు కేసులు మాత్రమే ఉన్నట్టు పేర్కొంది. అంతేకాదు, గత వేరియంట్లతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
అయితే, ఈ కొత్త సబ్ వేరియంట్ మరీ ప్రమాదకరం కాకపోయినా రూపాంతరం చెంది బలపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధి మరియా వాన్ ఖెర్ఖోవ్ ఇటీవల చెప్పారు. కాగా, దేశంలో నిన్న 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబరు తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.