మంత్రి మల్లారెడ్డిపై పొగడ్తల జల్లు కురిపించిన కేటీఆర్

KTR praises Mallareddy
  • మల్లారెడ్డి తామందరిలోకి యువకుడని పేర్కొన్న కేటీఆర్
  • ఆయనలోనే ఉత్సాహం ఎక్కువని వెల్లడి
  • సోషల్ మీడియాలో మల్లన్నదే హవా అని వివరణ
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై పొగడ్తల జల్లు కురిపించారు. తామందరిలోకి మల్లన్నే యువకుడు అని కొనియాడారు. తనకు, మల్లారెడ్డికి మధ్య 30 ఏళ్ల వయసు తేడా ఉందని, కానీ అందరికంటే ఆయనలోనే ఉత్సాహం ఎక్కువని అన్నారు. 

కాగా, తన కంటే మల్లారెడ్డి 20 ఏళ్లు పెద్ద అని కేటీఆర్ పేర్కొనగా, కాదు 30 ఏళ్లు పెద్ద అంటూ మల్లారెడ్డి చెప్పారు. ఇక, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మల్లన్న హవానే అని కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే ఆయన వయసు అంచనా వేయలేమని చమత్కరించారు. కష్టపడినా, పనిచేసినా, సక్సెస్ అయినా మల్లారెడ్డి ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు.
Go Back to Shorts
KTR
Ch Malla Reddy
BRS
Telangana

More Telugu News