Vishwak Sen: 'దాస్ కా ధమ్కీ' 10 రోజుల వసూళ్లు ఇవే!

  • విష్వక్ నుంచి వచ్చిన 'దాస్ కా ధమ్కీ'
  • ద్విపాత్రాభినయం చేసిన విష్వక్ 
  • నిన్నటితో 10 రోజులు పూర్తి 
  • ప్రపంచవ్యాప్తంగా 21.85కోట్ల గ్రాస్, 11.19 కోట్ల షేర్
Das Ka Dhamki movie update

విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'దాస్ కా ధమ్కీ' సినిమా, క్రితం నెల 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాకి ఆయనే దర్శక నిర్మాత. ప్రీ రిలీజ్ ఈవెంటుకి ఎన్టీఆర్ ను తీసుకురావడంతో, ఈ సినిమాపై ఆయన మంచి హైప్ ను తీసుకుని రాగలిగాడు. ఇక రిలీజ్ కి ముందువరకూ ఊపిరాడని విధంగా ప్రమోషన్స్ తో బజ్ తీసుకుని వచ్చాడు. 

విష్వక్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, నివేదా పేతురాజ్ కథానాయికగా అలరించింది. నిన్నటితో ఈ సినిమా 10 రోజులను పూర్తిచేసుకుంది. ఈ 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 16.10 కోట్ల గ్రాస్ ను .. 8.73 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల గ్రాస్ ను .. 11.19 కోట్ల షేర్ ను రాబట్టింది. 

ఈ 10 రోజుల్లో ఈ సినిమా 3 కోట్లకి పైగా లాభాలను తెచ్చిపెట్టిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఫస్టాఫ్ అంతా రొటీన్ గా .. సెకండాఫ్ అంతా వరుస ట్విస్టులతో నడుస్తుంది. స్క్రీన్ ప్లే బలంగా ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదనే అభిప్రాయాలు వినిపించాయి.

More Telugu News