BRS: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన బీఆర్ఎస్ నేత
జగిత్యాల జిల్లా గాంధీనగర్‌లో తాజాగా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత బండారి నరేందర్ డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు డ్యాన్స్ చేస్తున్న సందర్భంగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దీంతో.. పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో కూరుకుపోయాయి.
ఇటీవల కాలంలో అనేక మంది అకస్మాత్తుగా కుప్పకూలిపోయి మరణిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బీపీ, షుగర్, వంటి వ్యాధులు నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.