Pavan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం రెడీ అవుతున్న శ్రీలీల!

  • పవన్ హీరోగా రూపొందనున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
  • ఏప్రిల్ 5వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • 10వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న శ్రీలీల 
  • సంగీతాన్ని సమకూర్చుతున్న దేవిశ్రీ ప్రసాద్ 

Usthad Bhagath Singh movie update

టాలీవుడ్ హీరోయిన్స్ లలో శ్రీలీల ఇప్పుడు ఫుల్ బిజీ. 'ధమాకా' సినిమాతో పెద్ద హిట్ కొట్టేసిన ఈ బ్యూటీ, త్వరలో నితిన్ .. రామ్ .. వైష్ణవ్ తేజ్ జోడీగా అలరించనుంది. ఇక అనిల్ రావిపూడి సినిమాలో బాలకృష్ణ కూతురుగా కనిపించనుంది. బాలకృష్ణ తరువాత ఆమె పాత్రకే ప్రాధాన్యత ఉండనుంది. 

ఇక ఈ సుందరి పవన్ కల్యాణ్ జోడీగా కూడా ఛాన్స్ కొట్టేసింది. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా ఆమెను తీసుకున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఏప్రిల్ 5వ తేదీ నుంచి మొదలు కానుంది. 10వ తేదీ నుంచి శ్రీలీల పాల్గొననున్నట్టు తెలుస్తోంది. 

శ్రీలీల ఈ మధ్యనే ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ, సీనియర్ స్టార్ హీరోల జోడీగా కుదిరిపోయే ఫిజిక్ ఆమె సొంతం. అందుకుతోడు క్రేజ్ కి తగిన సక్సెస్ లు దక్కడం మరో విశేషం. అవే ఆమెను పవన్ సినిమా వరకూ తీసుకుని వెళ్లాయి. ఇక ఈ సినిమాలో మరో నాయికగా మాళవిక మోహనన్ కనిపించనుంది. మైత్రీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More Telugu News