కేసీఆర్ నాయకత్వంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
- ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కేసీఆర్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నానన్న అశోక్ చవాన్
- కేసీఆర్ వ్యూహాలు అర్థం కావడం లేదని వ్యాఖ్య
- విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్న చవాన్
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కేసీఆర్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నానని చవాన్ చెప్పారు. కేసీఆర్ వ్యూహాలు అర్థం కావడం లేదని అన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని కేసీఆర్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై చవాన్ స్పందిస్తూ... రాహుల్ పై వేటు వేయడాన్ని కేసీఆర్ ఖండించారని... దీన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. బీజేపీని కట్టడి చేయడానికి విపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన చవాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.