రావణాసురులను ఎలా సంహరించాలో జగన్ కు తెలుసు: తమ్మినేని సీతారాం
- టీడీపీ సభ్యులు తనను సీటు నుంచి తోసేసేందుకు యత్నించారన్న స్పీకర్ తమ్మినేని
- సభాపతి స్థానం పట్ల గౌరవం లేకుండా వ్యవహరించారని మండిపాటు
- తాను గౌతమ బుద్ధుడిని కాదని వ్యాఖ్య
శాసనసభలో శ్రీరాముడు వంటి సీఎం జగన్ ఉన్నారని.. రావణాసురులను ఎలా సంహరించాలో ఆయనకు తెలుసని చెప్పారు. టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని... కానీ, వారు ప్రవర్తించిన తీరు ఏ మాత్రం సరికాదని విమర్శించారు. సభాపతి స్థానం పట్ల గౌరవం లేకుండా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఎవరైనా సభ్యులు పోడియం వద్దకు లేదా స్పీకర్ స్థానం వద్దకు వస్తే ఆటోమేటిక్ గా సస్పెండ్ అయ్యేలా రూల్ ఉందని చెప్పారు.