UP Warriorz: డబ్ల్యూపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు తొలి ఓటమి రుచిచూపిన వారియర్స్

UP Warriorz halts Mumbai Indians winning streak in WPL
షార్ట్స్‌లో చూడండి
వరుసగా ఐదు విజయాలతో డబ్ల్యూపీఎల్ లో ఊపుమీదున్న ముంబయి ఇండియన్స్ కు టోర్నీలో తొలి ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబయికి యూపీ వారియర్స్ అడ్డుకట్ట వేశారు. ఇవాళ జరిగిన మ్యాచ్ లో వారియర్స్... ముంబయి ఇండియన్స్ పై 5 వికెట్ల తేడాతో నెగ్గారు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి విజయభేరి మోగించారు. 

ఓ దశలో వారియర్స్ 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా, తహ్లియా మెక్ గ్రాత్ (38), గ్రేస్ హారిస్ (39) కీలక భాగస్వామ్యంతో జట్టును గెలుపు బాటలో నిలిపారు. వీరిద్దరూ అవుటైన తర్వాత సోఫీ ఎక్సెల్ స్టోన్ (16 నాటౌట్), దీప్తి శర్మ (13 నాటౌట్) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించారు. ముంబయి బౌలర్లలో అమేలియా కెర్ 2, నాట్ షివర్ 1, హేలీ మాథ్యూస్ 1, ఇస్సీ వాంగ్ 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
UP Warriorz
Mumbai Indians
WPL

More Telugu News