ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెడుతున్న 'శ్రీదేవి - శోభన్ బాబు'
- రొమాంటిక్ కామెడీ జోనర్లో వచ్చిన 'శ్రీదేవి - శోభన్ బాబు'
- థియేటర్స్ వైపు నుంచి దక్కని ఆదరణ
- స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చేతికి
- ఈ నెల 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్
థియేటర్స్ నుంచి ఈ సినిమా పెద్దగా రెస్పాన్స్ ను రాబట్టుకోలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు.
హీరో తల్లిగా రోహిణి .. హీరోయిన్ తండ్రిగా నాగబాబు ముఖ్యమైన పాత్రలను పోషించారు. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. హీరో .. హీరోయిన్ పరిచయం పేచీలతో మొదలుకావడం .. ఆ తరువాత ప్రేమగా మారడం అనే రొటీన్ లైన్ తో ఈ సినిమా సాగుతుంది. ఓటీటీ వైపు నుంచి ఏమైనా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుందేమో చూడాలి మరి.