Kiran Abbavaram: 'ఆహా'లో 'వినరో భాగ్యము విష్ణు కథ' .. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Vinaro Bhagyamu Vishnu katha  will release on March 22nd
షార్ట్స్‌లో చూడండి
కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మంచి సక్సెస్ ను సాధించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, మురళీ కిశోర్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను రాబట్టింది. 

అలాంటి ఈ సినిమా 'ఆహా' ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. 'ఉగాది' పండుగ సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. కశ్మీర పరదేశి కథానాయికగా నటించిన ఈ సినిమా, మొదటి నుంచి చివరివరకూ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది.

మురళీశర్మ కామెడీ .. చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. అటు యూత్ .. ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ ఈ సినిమాలో ఉంది. అందువలన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
Go Back to Shorts
Kiran Abbavaram
Kashmira paradeshi
Murali Sharma

More Telugu News