ఇది మామూలు యాక్షన్ కాదే .. 'దసరా' ట్రైలర్ రిలీజ్!
- మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ గా 'దసరా'
- నాని జోడీగా అలరిస్తున్న కీర్తి సురేశ్
- సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణ్
- ఈ నెల 30వ తేదీన సినిమా విడుదల
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ధరణిగా నాని .. వెన్నెలగా కీర్తి సురేశ్ పాత్రలను పరిచయం చేస్తూ ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఒక వైపున ప్రేమ ... మరో వైపున వృత్తిపరమైన ఆధిపత్యం .. అది సహించలేని హీరో తిరుగుబాటుగా ఈ కథ నడుస్తుందని అనిపిస్తోంది.
తమ బతుకుల్లో చీకటి తెరలను కాల్చేయడం కోసం .. తమ ఆనందాలకు అడ్డుపడుతున్న అసురుడిని అంతం చేయడమే హీరో లక్ష్యంగా కనిపిస్తోంది. సముద్రఖని కూడా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు.