Venkatesh: ఈ వారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై సందడి గట్టిగానే ఉందే!

OTT Movies Releasing in this Week
షార్ట్స్‌లో చూడండి
అటు వెబ్ సిరీస్ లు .. ఇటు సినిమాల పరంగా చూసుకుంటే, ఈ వారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కాస్త గట్టిగానే సందడి కనిపిస్తోంది. రేపు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'యాంగర్ టేల్స్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. సుహాస్ .. బిందుమాధవి .. మడోన్నా సెబాస్టియన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. సుహాస్ నిర్మించిన ఈ సినిమాపై ఆందరిలో ఆసక్తి ఉంది. ఇక ఈ నెల 10వ తేదీన నెట్ ఫ్లిక్స్ ద్వారా 'రానా నాయుడు' వెబ్ సిరీస్ పలకరించనుంది. వెంకటేశ్ - రానా తండ్రీ కొడుకులుగా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ వెబ్ సిరీస్ లలో ఇది ఒకటిగా చెబుతున్నారు. దాంతో అందరి చూపు దీనిపైనే ఉంది. 'పుష్ప' జగదీశ్ ప్రధానమైన పాత్రను పోషించిన 'సత్తిగాని రెండెకరాలు' సినిమా, ఈ నెల 17వ తేదీన 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఒక కీలకమైన పాత్రలో వెన్నెల కిశోర్ కనిపించనున్నాడు. ఇక 17వ తేదీనే 'రైటర్ పద్మభూషణ్' Zee 5లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టిన ఈ సినిమాలో, సుహాస్ - టీనా శిల్పరాజ్ జంటగా అలరించనున్నారు. ఇక ఏప్రిల్ 1వ తేదీన నెట్ ఫ్లిక్స్ ద్వారా 'అమిగోస్' పలకరించనుందనే విషయం తెలిసిందే.
Go Back to Shorts
Venkatesh
Rana
Suhas

More Telugu News