‘గీత సాక్షిగా’ రిలీజ్ డేట్ ఖరారు!

Geetha Sakshiga Movie Update
షార్ట్స్‌లో చూడండి
నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోష‌న‌ల్ డ్రామా ‘గీత సాక్షిగా’. ఆద‌ర్శ్‌, చిత్రా శుక్లా జంట‌గా న‌టించిన ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంద‌రిలో తెలియ‌ని ఆస‌క్తిని క్రియేట్‌ చేయ‌ట‌మే కాకుండా, ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అయింది. ఇటీవ‌ల విడుద‌లైన మూవీ ఫ‌స్ట్‌లుక్‌ నుంచి సాంగ్స్ వరకూ సినిమాపై మంచి వైబ్ క్రియేట్ అయింది. 

చేతన్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకి ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహించాడు. హోలీ సంద‌ర్భంగా ప్రేక్ష‌కులంద‌రికీ శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ, ఈ సినిమాను మార్చి 22న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీలోను ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. 

నిజ జీవిత సంఘటనల ఆధారంగా మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమాలో 'చ‌రిష్మా' కీ రోల్ పోషించింది. ఆమె చుట్టూనే ఈ క‌థాంశం తిరుగుతుంది. ఇంకా ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్‌ .. రూపేష్ శెట్టి .. చ‌రిష్మా .. భ‌ర‌ణి శంక‌ర్‌ .. జ‌య‌ల‌లిత‌ త‌దిత‌రులు న‌టించారు.

Go Back to Shorts
Adarsh
Chitra Shukla
Geetha Sakshiga Movie

More Telugu News