Siri: శ్రీహాన్ - సిరి జంటగా వెబ్ సిరీస్!

Siri Interview
షార్ట్స్‌లో చూడండి
బుల్లితెర అందాల భామగా సిరి హనుమంతుకి మంచి క్రేజ్ ఉంది. టీవీ షోస్ తోను .. సీరియల్స్ తోను ఆమె బిజీ. ఇటీవల జీ 5 నుంచి వచ్చిన 'పులి - మేక' వెబ్ సిరీస్ లోను సిరి ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ వెబ్ సిరీస్ సీజన్ 2లో ఆమె పాత్రనే లీడ్ తీసుకోనున్నట్టుగా చూపించడం విశేషం. 

ఇక శ్రీహాన్ కి 'బిగ్ బాస్' సీజన్ 6 ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. శ్రీహాన్ - సిరి ప్రేమ వ్యవహారం కూడా 'బిగ్ బాస్' వల్లనే హైలైట్ అయింది. బిగ్ బాస్ హౌస్ కి శ్రీహాన్ కోసం సిరి వచ్చిన ఎపిసోడ్ ను కూడా చాలామంది ఇంకా మరిచిపోలేదు. అలాంటి ఈ జంట త్వరలో వెబ్ సిరీస్ లో కనిపించనుంది.  

తాజా ఇంటర్వ్యూలో సిరి మాట్లాడుతూ .. "మా ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూడటానికి ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అందువలన మేమిద్దరం కలిసి వెబ్ సిరీస్ లో చేద్దామని అనుకున్నాము. ఇంతలో శేఖర్ మాస్టర్ ప్రొడక్షన్ హౌస్ లో చేసే ఛాన్స్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ లో చేస్తున్నాము" అంటూ చెప్పుకొచ్చింది. 

Go Back to Shorts
Siri
Srihan
Sekhar Master
WebSeries

More Telugu News