‘ఫస్ట్‌నైట్’ను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టిన భర్త అరెస్ట్
- కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఘటన
- ఫిబ్రవరి 8న బాలికతో యువకుడి వివాహం
- తొలిరేయి దృశ్యాలను సోషల్ మీడియాకెక్కించేసి కలకలం రేపిన వైనం
- బాలిక తల్లి ఫిర్యాదుతో అరెస్ట్
గత నెల 8న గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు 20 ఏళ్ల యువకుడితో వివాహం జరిగింది. ఆ తర్వాత జరిగిన తొలిరేయి దృశ్యాలను వీడియో తీసి వాటిని అతడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అంతే.. ఒక్కసారిగా కలకలం రేగింది.
విషయం తెలిసిన బాలిక తల్లి గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 28న అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని కాట్రేనికోన పోలీసులు నిన్న వెల్లడించారు.