భారత జవాన్లపై బంగ్లాదేశ్ వాసుల దాడి
- సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు
- పశువులను బార్డర్ దాటిస్తుండగా అడ్డుకున్న సైనికులు
- వందమందికి పైగా మూకుమ్మడిగా దాడిచేసిన బంగ్లా వాసులు
అక్కడే ఉన్న జవాన్లు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా గ్రామస్థులంతా కలిసి సైనికులపై దాడి చేశారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న మరికొంతమంది గ్రామస్థులు కూడా దాడిలో పాల్గొన్నారు. సుమారు వంద మంది దాకా గ్రామస్థులు పదునైన ఆయుధాలు, కట్టెలతో దాడి చేయడంతో జవాన్లు ఇద్దరు గాయపడ్డారు. ఆపై సైనికుల దగ్గరున్న ఆయుధాలను గ్రామస్థులు ఎత్తుకెళ్లారు. అనంతరం అక్కడికి చేరుకున్న తోటి సైనికులు గ్రామస్థుల దాడిలో గాయపడ్డ జవాన్లను ఆసుపత్రికి తరలించారు.