మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్... దక్షిణాఫ్రికా టార్గెట్ 157 రన్స్
- నేడు కేప్ టౌన్ లో ఫైనల్ మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు
- లక్ష్యచేదనలో 10 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులు చేసిన సఫారీలు
సఫారీ బౌలర్లు ఆసీస్ బ్యాటింగ్ లైనప్ ను సమర్థంగా కట్టడి చేశారు. భారీ స్కోరు సాధించకుండా నిలువరించారు. షబ్నిమ్ ఇస్మాయిల్ 2, మరిజానే కాప్ 2, ఎంలబా 1, క్లో ట్రయోన్ 1 వికెట్ తీశారు. ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ బెత్ మూనీ అజేయంగా 74 పరుగులు చేసింది. ఆష్లే గార్డనర్ 29, వికెట్ కీపర్ అలిస్సా హీలీ 18 పరుగులు చేశారు.
అనంతరం, 157 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా అమ్మాయిల జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులు చేసింది. ఆ జట్టు ఇంకా 60 బంతుల్లో 105 పరుగులు చేయాలి. క్రీజులో ఓపెనర్ లారా ఓల్వార్ట్ 28, కెప్టెన్ సున్ లూస్ 1 పరుగుతో ఉన్నారు.