గుమ్మడికాయ కొట్టిన ‘దాస్ కా ధమ్కీ’
- షూటింగ్ పూర్తయినట్టు ప్రకటించిన చిత్ర బృందం
- స్వీయ దర్శకత్వంలో విష్వక్సేన్ హీరోగా వస్తున్న సినిమా
- హీరోయిన్ గా నటించిన నివేదా పేతురాజ్
వేసవి కానుకగా మార్చి చివర్లో లేదంటే ఏప్రిల్ లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. రావు రమేష్, రోహిణి, పృథ్వీరాజ్, హైపర్ ఆది ఇతర కీలక పాత్రలు పోషించారు.