రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన అనుష్క.. ఇప్పుడు ఎలా ఉందంటే!
- బెంగళూరులో శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న అనుష్క
- నిశ్శబ్ధం తర్వాత బయటకు రాని స్వీటీ
- ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో సినిమా చేస్తున్న అనుష్క
దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె బయట కనిపించడంతో అభిమానులందరూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. వైట్ డ్రెస్ లో సింపుల్ గా ఉన్న అనుష్క కాస్త బొద్దుగా కనిపించింది. అనుష్క చివరగా ‘నిశ్శబ్ధం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం 2020లో విడుదలవగా.. ఆమె ప్రమోషన్స్ లో పాల్గొన్నది. అనంతరం ఏ వేదికపైనా అనుష్క కనిపించలేదు. కాగా, అనుష్క ప్రస్తుతం యువ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. దీనికి ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ అనే టైటిల్ ఖరారు చేశారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.