చదువులో ఒత్తిడి భరించలేక.. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

చదువులో ఒత్తిడి భరించలేక.. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

Idupulapaya IIIT Student Committed Suicide
  • కిటికీకి చున్నీతో ఉరి వేసుకున్న యువతి
  • ఈసీఈ చివరి సంవత్సరం చదువుతున్న అఖిల
  • ప్రేమ విఫలం వల్లేనన్న డైరెక్టర్ సంధ్యారాణిపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
చదువులో ఒత్తిడి భరించలేకపోయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం భోగ్యంపల్లెకు చెందిన అఖిల (21) ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఈసీఈ చివరి సంవత్సరం చదువుతోంది. నిన్న సాయంత్రం హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో చున్నీతో కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ప్రేమలో విఫలం కావడం వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువులో ఒత్తిడి వల్లే ఆమె ప్రాణాలు తీసుకుందంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఫోన్ చేసినప్పుడల్లా తమకు ఈ విషయం చెప్పేదన్నారు. అఖిల ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Idupulapaya
Idupulapaya IIIT
Girl Student

More Telugu News