హాట్ స్టార్ లో 'వీరసింహా రెడ్డి' .. ట్రైలర్ రిలీజ్!

Veerasimha Redddy OTT Release Date
షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'వీరసింహా రెడ్డి' జనవరి 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. కథాకథనాల పరంగా .. పాటల పరంగా .. డాన్సుల పరంగా .. డైలాగ్స్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ట్రైలర్ ను కొంతసేపటిక్రితం రిలీజ్ చేశారు. 

శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ .. దునియా విజయ్ .. హనీ రోజ్ కీలకమైన పాత్రలను పోషించారు. వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక ఇదే బ్యానర్లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సినిమా, ఈ నెల 27వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ కానుందనే సంగతి తెలిసిందే.

Go Back to Shorts
Balakrishna
Sruthi Haasan
Varalakshmi Sharath Kumar
Veerasimha Reddy Movie

More Telugu News