Nagababu: మహాసేన రాజేష్ గురించి జనసైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడకండి: నాగబాబు

Nagababu says do not talk about Mahasena Rajesh
షార్ట్స్‌లో చూడండి
దళిత వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న మహాసేన రాజేష్ ఈ నెల 16న చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా చంద్రబాబు పెద్దాపురం రానున్నారు. ఈ సందర్భంగా మహాసేన రాజేష్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన తొలుత జనసేనలోకి వెళతారని ప్రచారం జరిగింది. అయితే, టీడీపీలో చేరుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. మహాసేన రాజేష్ గురించి జనసైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడకండి అంటూ ట్వీట్ చేశారు. అతను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడనేది అతని ఇష్టం... అది తన ప్రజాస్వామ్య హక్కు అని నాగబాబు స్పష్టం చేశారు. అతడి నిర్ణయం ఎలాంటిదైనా గౌరవించాలని, అతడికి శుభాకాంక్షలు తెలపాలని సూచించారు.
Go Back to Shorts
Nagababu
Mahasena Rajesh
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News