తన కారుపై రాళ్లదాడి పట్ల సింగర్ మంగ్లీ స్పందన
- బళ్లారిలో ఒక ఈవెంట్ కు హాజరైన మంగ్లీ
- ఆమె కారుపై దాడి జరిగిందంటూ ప్రచారం
- ఆ కారులో తాను లేనని చెప్పిన మంగ్లీ
బళ్లారిలో జరిగిన ఈవెంట్ పెద్ద సక్సెస్ అయిందని... కన్నడ అభిమానులు తనపై చూపించిన అభిమానం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. కొందరు అభిమానులు తనతో సెల్ఫీలు కూడా దిగారని తెలిపారు. అధికారులు, నిర్వాహకులు కూడా తన పట్ల ఎంతో జాగ్రత్త తీసుకున్నారని చెప్పారు. త్వరలోనే తాను కన్నడ భాషను నేర్చుకుంటానని అన్నారు. దాడి జరిగిన కారులో తాను లేనని స్పష్టం చేశారు. మరోవైపు కార్యక్రమంలో కన్నడలో మాట్లాడేందుకు మంగ్లీ ఇబ్బంది పడినందుకే ఈ దాడి జరిగి ఉండొచ్చని కొందరు అంటున్నారు.