నేపాల్ విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు.. వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేపాల్ విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు.. వీడియో ఇదిగో!

Nepal Crash Captured By Indian Passenger
  • రెస్క్యూ సిబ్బందికి దొరికిన ఫోన్ లో వీడియో బయటపెట్టిన అధికారులు
  • ల్యాండింగ్ దృశ్యాలను తన ఫోన్ లో రికార్డ్ చేసిన భారత ప్రయాణికుడు
  • కూలిపోతున్న విమానాన్ని వీడియో తీసిన నేపాలీ యువకుడు
నేపాల్ లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు తీసిన ఈ వీడియోలో విమానం ల్యాండింగ్ ద‌ృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానంలోని భారతీయ ప్రయాణికుడు ఒకరు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. పొఖారా ఎయిర్ పోర్టు సమీపంలోకి చేరుకున్న ఫ్లైట్.. కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది.. మొత్తం 72 మంది ప్రాణాలు కోల్పోయారు.

విమానం కూలిపోవడంతో అలర్ట్ అయిన అధికారులు ప్రయాణికులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ప్రయాణికులు అందరూ సజీవ దహనమయ్యారు. రెస్క్యూ పనుల్లో నిమగ్నమైన సిబ్బందికి ఓ మొబైల్ ఫోన్ దొరికింది. అందులో విమాన ప్రమాదానికి ముందు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు, ల్యాండింగ్ సమయంలో కంట్రోల్ తప్పిన విమానం నేలవైపు దూసుకురావడాన్ని నేపాలీ పౌరుడు ఒకరు వీడియో తీశాడు. ఓ బిల్డింగ్ పై నుంచి తీసిన ఈ వీడియోలో యతి ఎయిర్ లైన్స్ విమానం కూలిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
Advertisement
nepal flight accident
flight
pokhara
last minute vedeo
passenger

More Telugu News