జోషిమఠ్ కుంగుబాటుపై ఇస్రో నివేదిక మాయం
- 12 రోజుల్లోనే 5.4 సెంటీమీటర్లు కుంగిపోయిందని నివేదిక ఇచ్చిన ఇస్రో
- నివేదికను తొలగించడంపై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వివరణ
- ప్రజల్లో గందరగోళం నెలకొనేలా ప్రకటనలు చేయొద్దంటూ శాస్త్రవేత్తలకు సూచన
గందరగోళానికి తావివ్వొద్దనే..
ఇస్రో నివేదికను తొలగించిన తర్వాత జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్ డీఎంఏ) మీడియాకు ఓ మెమోరాండం విడుదల చేసింది. జోషిమఠ్ కుంగుబాటుపై ప్రభుత్వ రంగ సంస్థలు సొంతంగా విడుదల చేస్తున్న నివేదికలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొంది. జోషిమఠ్ స్థానికులతో పాటు దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించేలా ప్రకటనలు చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో చర్చకు వచ్చిందని తెలిపింది. దీంతో ఈ విషయంపై నేరుగా మీడియాతో మాట్లాడొద్దంటూ శాస్త్రవేత్తలకు ప్రభుత్వం సూచించినట్లు వివరించింది.