యాక్షన్ మూవీగా 'హంట్' .. స్టంట్స్ మేకింగ్ వీడియో!

Hunt Movie Stunts Making Video Release
  • సుధీర్ బాబు హీరోగా రూపొందిన 'హంట్'
  • యాక్షన్ ప్రధానంగా సాగే సినిమా 
  • హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ పనిచేశారన్న సుధీర్ బాబు 
  • ఆడియన్స్ ను ఈ సినిమా థ్రిల్ చేస్తుందని వెల్లడి
సుధీర్ బాబు హీరోగా 'హంట్' సినిమా రూపొందింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ .. 'ప్రేమించు' ఫేమ్ భరత్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ ను మొదలెట్టింది. అందులో భాగంగా ఈ సినిమా నుంచి స్టంట్స్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. సుధీర్ బాబు మాట్లాడుతూ .. "ఇది రెగ్యులర్ ఫార్మేట్ మూవీ కాదు .. డిఫరెంట్ టెక్నాలజతో డిజైన్ చేసిన మూవీ. ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ ప్రధానం" అన్నాడు.  

" హాలీవుడ్ సినిమాలకి పని చేసిన స్టంట్ మాస్టర్స్ ఈ సినిమాకి వర్క్ చేశారు. ప్రతి యాక్షన్ సీన్ ను కూడా  ముందుగా డిజైన్ చేయించి .. రిహార్సల్స్ చేసి షూట్ కి వెళ్లడం జరిగింది. అందువలన ప్రతి ఫైట్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది. రోప్స్ గానీ .. బెడ్స్ గాని .. డూప్ ను గాని ఉపయోగించకుండా చేయడం ఈ సినిమా ప్రత్యేకత. కథ .. కథనంతో పాటు టెక్నాలజీ పరంగా కూడా ఆడియన్స్ ను ఈ సినిమా థ్రిల్ చేస్తుంది" అని చెప్పుకొచ్చాడు.
Advertisement
Sudheer Babu
Srikanth
Bharath
Hunt Movie

More Telugu News