అయోధ్య రామాలయం ప్రారంభ తేదీని వెల్లడించిన అమిత్ షా

Ram temple will be ready on Jan 1 2024 Says Amit Shah
  • త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అమిత్ షా
  • వచ్చే ఏడాది జనవరి 1 నాటికి సిద్ధమవుతుందన్న కేంద్రమంత్రి
  • కాంగ్రెస్, సీపీఎంపై నిప్పులు చెరిగిన షా
అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఎప్పుడు ప్రారంభమయ్యేది కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. నిన్న త్రిపురలోని సబ్రూంలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన.. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి రామాలయం ప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు. ‘‘రాహుల్ బాబా సబ్రూం నుంచి చెబుతున్నా.. 1 జనవరి 2024 నాటికి రామాలయం సిద్ధమవుతుంది’’ అని నొక్కి చెప్పారు. పనిలో పనిగా త్రిపురలో ప్రధాన ప్రతిపక్షాలైన సీపీఎం, కాంగ్రెస్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు కలిసి అయోధ్యలో రామాలయం నిర్మించకుండా ఏళ్లపాటు ఆ సమస్యను కోర్టులో నానబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రామాలయ ట్రస్ట్ ప్రతినిధుల్లో పలువురు మద్దతు తెలిపిన నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్ షా వ్యాఖ్యలను బట్టి వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రామాలయమే బీజేపీ ప్రధాన అస్త్రంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Advertisement
Amit Shah
Tripura
Ayodhya Ram Mandir
BJP

More Telugu News