ఏపీలో ఏమైనా ఎమర్జెన్సీ విధించావా?: నారా లోకేశ్
- ఈ రాష్ట్రం నీ జాగీరా జగన్ రెడ్డీ? అని ప్రశ్నించిన లోకేశ్
- కుప్పంపై పోలీసులు అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించారని విమర్శ
- కుప్పం నీలాంటి కుట్రదారులను ఎంతో మందిని చూసిందని వ్యాఖ్య
చట్టం మీ ఎదుగూరి సందింటికి ఎదురింటి చుట్టమా? అని ప్రశ్నించారు. ఎన్ని అరాచకాలకు పాల్పడినా నీపై వ్యతిరేకత తగ్గదని జగన్ పై మండిపడ్డారు. చంద్రబాబుకు జనాదరణ పెరుగుతూనే ఉంటుందని అన్నారు. కుప్పం 35 ఏళ్లుగా నీలాంటి కుట్రదారులను ఎంతోమందిని చూసిందని చెప్పారు. కుప్పం తెలుగుదేశం కోట అని.. ఇక్కడ నీ కుప్పిగంతులు చెల్లవని అన్నారు. పసుపుసైన్యం కదం తొక్కుతోందని... తల్లకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు కుప్పం పర్యటనను అపలేవని చెప్పారు.